R1

🔸 ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి: మోదీజీ

🔸 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీజీ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన సంస్కరణలను దేశ ప్రజలకు వివరించారు
🔸 ‘‘స్వాతంత్ర్య సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైంది. కరోనా విపత్కర సమయంలోనూ దేశం ఒక్కటై నిలబడింది. 25 ఏళ్లు వచ్చిన ప్రతిబిడ్డ సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటోంది. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించలేకపోయింది. ఈ క్షణం నుంచి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకువెళ్లాలి.

🔸 ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం. ఏ ఒక్కరూ ఏకాకిగా మనలేరు. భారత్‌ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం. ప్రపంచ కల్యాణానికి మనవంతు కూడా నిరంతరం చేస్తున్నాం. ఆత్మనిర్భర్‌ భారత్‌ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలి. దేశ యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి’’ అని మోదీజీ పిలుపునిచ్చారు.

🔸 వోకల్‌ ఫర్‌ లోకల్‌…
‘‘భారత్‌ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. ఒకనాడు భారత వస్తువులు అంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. భారత్‌ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న గౌరవాన్ని తెచ్చుకుందాం. మన వస్తువులను మనమే గౌరవించకుంటే ప్రపంచం ఎలా గౌరవిస్తుంది. పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది.

🔸 నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనే మాటను నిలబెట్టుకుందాం’’ అని మోదీజీ అన్నారు.
🔸 అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించాం..
వ్యవసాయం నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించామని ప్రధాని మోదీజీ తెలిపారు. ‘‘ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌ కొత్తపుంతలు తొక్కుతోంది. ఎఫ్‌డీఐల్లో గతేడాది 18 శాతం వృద్ధి సాధించాం. ఎఫ్‌డీఐల్లో వృద్ధి ప్రపంచం మనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం.

🔸 అనేక సంకటాలు ఎదుర్కొన్న దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. దేశ వ్యాప్తంగా నూతన మౌలిక వసతుల అభివృద్ధికి 7వేల ప్రాజెక్టులు ప్రారంభించాం. ఈ ప్రాజెక్టులు అనేక పరిశ్రమలు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. స్వర్ణ చతుర్భజి దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

🔸 గడిచిన ఆరేళ్లలో సామాన్యుల జీవన ప్రమాణాల మెరుగుకు అనేక పథకాలు తెచ్చాం. బ్యాంకు ఖాతాలు, రేషన్‌ పంపిణీ, నగదు బదిలీ చేపట్టాం. ఒకే కార్డు ఒకే దేశం వంటి అనేక పథకాలు చేపట్టాం. కష్ట కాలంలో ప్రతి ఇంటికీ ఆహార ధాన్యాలు చేరాయి. ఉచిత గ్యాస్‌, ఆహార ధాన్యాల పంపిణీ 80 కోట్ల మందిని ఆకలి నుంచి దూరం చేశాయి.
🔸 రైతుల ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. వ్యవసాయ అనుంబంధ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం కల్పిస్తున్నాం. రైతులే స్వయంగా ఆహార శుద్ధికి ముందుకు వచ్చేలా చేస్తు్న్నాం. స్వచ్ఛమైన తాగునీటితో సగం ఆరోగ్య సమస్యలకు సమాధానం చెప్పవచ్చు. జల్‌జీవన్‌ మిషన్‌తో ఆరోగ్య రంగంలో గొప్ప మార్పు వస్తుంది’’ అని మోదీజీ వివరించారు.
🔸 కట్టుదిట్టమైన భద్రత..

ఓవైపు కట్టుదిట్టమైన భద్రత… మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.సుమారు 4 వేల మంది అథితులు హాజరయ్యారు. అదే స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా మోహరించారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు.

🔸 అతిథుల కోసం వేదిక వద్ద మాస్కులు అందుబాటులో ఉంచారు. కుర్చీల మధ్య రెండు గజాల దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. వేదిక సమీపంలో మెడికల్‌ బూత్‌లను, అంబులెన్సులను ఏర్పాటు చేశారు.
🔸 స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు ఎన్‌ఎస్‌జీ, ఎస్‌పీజీ, ఐటీబీపీ తదితర భద్రతా సంస్థలతో కలిసి బహు అంచెల భద్రతను కల్పించారు. ఎర్రకోట వద్ద 4,000 మంది భద్రతా సిబ్బందిని, 300 కెమెరాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు

PRESSLINK:

https://youtu.be/E7vNyyedIjM

https://youtu.be/nUUKX4CpZao

Amos 5: 15
Hate the evil, and love the good, and establish judgment in the gate: it may be that the LORD God of hosts will be gracious unto the remnant of Joseph. Amen!!

One thought on “R1

Leave a comment